పెథాయ్ తుఫాను బాధితులకు అండగా జనసైనికులు


కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటం లో జనసేన సైనికులు ముందు ఉంటారనీ జనసేన నాయకుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గతనాలుగు రోజులుగా పెథాయ్ తుఫాను వలన ఉప్పాడ ప్రాంతంలో పలువురు నిరాశ్రాయులు అయిన వారికి అమలాపురం జనసేన తుఫాను బాదితుల సహాయ టీమ్ వారు తీసుకువచ్చిన సుమారు టన్నునర బియ్యం 100 కేజీల కందిపప్పు పూర్తిగా తుఫాను వలన ఇళ్ళు ధ్వంసమైన వారికి పంపిణీ చేసారు. ఈ సందర్భం గా అమలాపురం జనసైనిక్ RDS ప్రసాద్ మాట్లాడుతూ మేమంతా జనసేన అధినేత ఆధేశాలమేరకు సహాయ కార్యక్రమాలలో బాగంగా ఉప్పాడ తీర ప్రాంతంలో పూర్తిగా నిరాశ్రయులు అయిన 150 కుటుంభాలకు కంది పప్పు బియ్యం ఇక్కడ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో పంపిణీ చేయటం జరిగిందనీ తెలిపారు.

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు