తూర్పు గోదావరి జిల్లా పొన్నాడ గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో శ్రీ తెలగంశెట్టి చక్రం శ్రీమతి కృష్ణవేణి దంపతులకు 1969 వ సంవత్సరంన జన్మించిన తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు చిన్నతనం నుంచి అందరితో తలలో నాలుకలా ఉండేవారు.
ప్రభుత్వ పాఠశాలలోనే అభ్యసించిన వెంకటేశ్వరరావు గారు పొన్నాడ గ్రామస్తుల కష్టసుఖాలలో పాలు పంచుకునేవారు. సామాజిక బాధ్యతతో బలహీన వర్గాలవారికి చేయూత నివ్వడం, ప్రజలకున్న సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకునివెళ్ళి ఆ సమస్యల పరిస్కారానికి కృషి చేయడం అయన నైజం. పొన్నాడ గ్రామంలో వృద్ధుల కోసం ఒక ఓల్డేజ్ హోమ్ ని నిర్మించి వృద్దులకు సేవ చేస్తున్నారు.
సాదరణంగా మద్య తరగతి కుటుంభంలో జన్మించిన నేను బడుగు బలహీనుల జీవితాలు నన్ను చాలా ప్రభావితం చేసాయి.. నేను నాకుటుంభం సుఖంగా ఉంటేనే జీవితం కాదు మన చుట్టూ ఉన్న కుటుంభాలు, సమాజం కూడా బాగా ఉండాలనీ కోరుకోవటం నా ఆలోచన విధానం అలా నాలో మొదలైన ఆలోచనలలో బాగమే నా రాజకీయ ప్రవేశం.. మన దేశంలో నూటికి 80 శాతం మంది పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటం లేదని మనందరికీ తెలుసు అందరూ ఎటువంటి బేషజాలాలకు పోకుండా రాజ్యాంగ పరంగా దాని పరిది సుఖవంతమైన జీవితం గడపాలనే నాకోరిక నన్ను రాజకీయాలకు పోత్సహించింది. అందుకే గత ఏన్నికల్లో సైతం నేను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రాజకీయాలలో ఉన్నాను.. ఇక జనసేనలో నా ఆరగ్రేటం బ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థలో పరిపాలనను, పాలనా విదానాన్ని పూర్తిగా ప్రక్షాలన చేయటం మనదేశంలో పౌరులందరికీ తక్షణ కర్తవ్యం అలా మార్పు చెందాలంటే అవినీతి మచ్చలేని నాయకుడు మనందరీకీ అవసరం అలాంటి ఆలోచన విధానం కల్గిన పవన్ కల్యాణ్ గారికి నేను ఆకర్షితుడునయ్యాను నా వంతుగా నీతికి నిజాయితికి నిలువెత్తు సాక్షమైన పవన్ గారి అడుగు జాడలలో నడిచి సమాజ మార్పులో ఉడతాభక్తిగా నేను సైతం ఉండాలనీ నిర్ణయించుకున్నాను. అందులో బాగమే జనసేనలో నాప్రయాణం..
మన పిఠాపురం ఖ్యాతిని దేశ రాజధాని ఢిల్లీలో వినిపించిన మన అందరి నాయకుడు జన సేవకుడు పేదల పెన్నిధి మన అందరి గొంతుని సామాన్యుడి ప్రతినిధి తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం జాతీయ విశిష్ట అవార్డు అందుకున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలోని నేటికీ పరిష్కారం కానీ ప్రధాన సమస్యలు

ఈ ప్రాంతం లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు జరుగక ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ లతో కళకళలాడుతూ ఉంటుంది. మార్కెట్ ప్రాంతంలో అయితే కదలలేని స్థితి. ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఆట స్థలం వున్నా రాజకీయ గ్రహణం పట్టి నీటికీ కళావిహీనంగానే వుంది.కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేయాల్సిన పాలిటెక్నిక్ కళాశాల రాజకీయ ఎత్తుగడలతో పిఠాపురంలో ఏర్పాటు చేసినా నీటికీ సొంత భవనం లేక ఆర్ఆర్ బిహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో తల దాచుకుంది. రామాటాకీస్ సినిమా థియేటర్ సమీపంలో ఏర్పాటుకు తలపెట్టిన రైల్వే క్రాసింగ్ వంతెన కల నీటికీ కలగానే మిగిలిపోయింది.

ఫీలింగ్ యూనిట్ల ఏర్పాటు

కొత్తపల్లి మండలం, అమరవిల్లి గ్రామ పొలిమేరల్లో ఏర్పాటు అయిన సిబే సీఫుడ్ ఐస్ ఫ్యాక్టరీలో అక్రమంగా చేస్తున్న నెక్కంటి సిఫుడ్ కంపెనీ ఫీలింగ్ కార్యక్రమాల ద్వారా భరించరాని దుర్గంధం రావడం మరియు అంటురోగాలు ప్రభలడంతో రామన్నపాలెం ప్రజలు ప్రతిఘటించి మూయించి వేయడం జరిగింది. అయితే కెఎస్ఇజెడ్ భాదితులకు ఏర్పాటు చేసిన కాలనీ సమీపంలో మరలా అదే తరహా యూనిట్ ను ప్రారంభిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటివలన ఆక్వా చెరువులు పతనమయ్యే పరిస్థితి వుంది.

వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం

విద్యార్థుల సంఖ్యా పరంగా 200 మందికి ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆయా పాఠశాలలో ఉండాల్సి వున్నా... 1200 పైబడి విద్యార్థిని విద్యార్థులు ఉన్న అనేక పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయులు అధిక శాతం ఒక్కరే ఉండటం ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యం. క్రీడలు లేని పాఠశాలల్లో చిన్నారులకు ఆరోగ్యం ఎక్కడ సమకూరుతుంది... ? ఎక్కడ ఆరోగ్యముతో కూడిన విద్య అందుతుంది... ? గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడాకారులు భావితరాలకు ఎలా వెళతారు... ?

జీడిమామిడి, సరుగుడు పెంపకం

కెఎస్ఇజెడ్ పుణ్యమా జీడిమామిడి, సరుగుడు కనుమరుగు, రాని పరిశ్రమల కోసం అక్రమముగా భూ సేకరణ పుణ్యమా ప్రభుత్వ సహాయం కోరని సెజ్ బాధిత ప్రాంతాలలో జీడిమామిడి, సరుగుడు కనుమరుగై మరుభూముల్లా మారిపోయాయి. రైతుకు తీరని నష్టం వాటిల్లింది.

పిబిసి, ఏలేరు ఆధునీకరణ

వ్యవసాయ రంగానికి జీవనాధారమైన సాగు నీరు పిబిసి, ఏలేరు కాలువల ద్వారా రైతులకు ఆయా ఆయకట్టుకు చేరాల్సి ఉంది. కానీ మంజూరు అయినది అని ప్రకటనలు చేయడం మినహా కాలువలు ఆధునీకరణ పనులకు నోచుకోక పిబిసి నీటి విడుదల సమయంలో రైతుకు వంతుల వారి సాగునీరు అందడం, వరదల సమయం ఏలేరు నీరు ముంపునకు గురి చేయడం పరిపాటిగా మారింది. ఈ సమస్య నీటికి కలగానే మిగిలి పోయింది.


గొల్లప్రోలు మండలంలో సమస్యలు

ఇక్కడ వరి సాగుతో పాటుగా ఉల్లి కూడా పోటీ పడుతూ పండిస్తారు. కానీ గిట్టుబాటు ధర రైతుకు ఎప్పుడూ ఉండదు. మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉండాల్సి ఉండగా అటు కొత్తపల్లి మండలానికిగాని ఇటు గొల్లప్రోలుకు గానీ ఏర్పాటు చేయలేదు. చేబ్రోలు పరిసరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పట్టు పురుగుల పెంపకంలో అనేక అవకతవకలు చోటు చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం ఆయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.


ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు